AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీ ఇరిగేషన్ క్యాలెండర్‌లోకి మరో 11 ప్రాజెక్టులు..!

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రకటించిన ఇరిగేషన్ క్యాలెండర్‌కు అదనంగా మరో 11 ప్రాజెక్టులను చేర్చి, వాటిని ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఇరిగేషన్ క్యాలెండర్‌లోని మొత్తం ప్రాజెక్టుల సంఖ్య 36కు చేరింది. సోమవారం సచివాలయంలో జలవనరుల శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.

 

ఇటీవల కలెక్టర్ల సమావేశంలో 25 ప్రాజెక్టులతో ఇరిగేషన్ క్యాలెండర్‌ను ప్రకటించిన సీఎం, తాజా సమీక్షలో మరో 11 ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిచ్చారు. ఈ 36 ప్రాజెక్టుల పనులను క్యాలెండర్ ప్రకారం పూర్తి చేయాలని, భూసేకరణ, నిధుల కొరత లేకుండా చూడాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు.

 

పోలవరం, ఇతర ప్రాజెక్టులపై సీఎం ఆదేశాలు

 

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ప్రతినెలా సమీక్ష నిర్వహిస్తానని సీఎం స్పష్టం చేశారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులను 2027 మార్చి 31 నాటికి, నిర్వాసితుల తరలింపును 2027 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. పోలవరం స్పిల్ వే వద్ద పర్యాటక ఆకర్షణగా ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని సూచించారు.

 

అలాగే వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ఈ ఏడాది జూలై నాటికి పూర్తి చేయాలని, హంద్రీ-నీవా కాలువ ద్వారా ఈ ఏడాదే నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ ఆలస్యం కాకుండా కాల్వలకు నీటిని విడుదల చేయాలని, జలధార-జలహరతి కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలను పునరుద్ధరించి రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

ఇరిగేషన్ క్యాలెండర్‌లోని 36 ప్రాజెక్టుల వివరాలు:

 

1. కాటన్ బ్యారేజ్ గేట్స్ (ఫౌండేషన్) – జూన్ 2026

2. పోలవరం ఎడమ ప్రధాన కాలువ – జూలై 2026

3. గుంటూరు ఛానల్ ఆధునీకరణ (ఫౌండేషన్) – జూలై 2026

4. వెలిగొండ ఫేజ్ – 1 – ఆగస్టు 2026

5. తుంగభద్ర కొత్త గేట్లు – జూన్ / జూలై 2026

6. హంద్రీ నీవా బ్రాంచ్ (ఫౌండేషన్) – ఆగస్టు 2026

7. గాలేరు నగరి (ఫౌండేషన్) – ఆగస్టు 2026

8. నేరడి బ్యారేజ్ (ఫౌండేషన్) – నవంబర్ 2026

9. మద్దువలస ఫేజ్-2 – జనవరి 2027

10. హీర మండలం ఎత్తిపోతల పథకం – ఏప్రిల్ 2027

11. నాగావళి – చంపావతి నదుల లింక్ – జూన్ 2027

12. పోలవరం ప్రాజెక్ట్ – జూన్ 2027

13. బుడమేరు ఫ్లడ్ ప్రొటెక్షన్ – జూన్ 2027

14. ముక్త్యాల ఎత్తిపోతల పథకం – జూన్ 2027

15. వంశధార ఫేజ్-2 స్టేజ్-2 (హిర మండలం బ్యారేజ్) – జూలై 2027

16. చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్ 1 – జూన్ / జూలై 2027

17. హంద్రీ-నీవా ఫేజ్-2 (నీవా బ్రాంచ్ కెనాల్ వరకు) – అక్టోబర్ 2026

18. తోటపల్లి డిస్ట్రిబ్యూటరీ – జూలై 2027

19. నీవా బ్రాంచ్ కెనాల్ (మూలపల్లి వరకు) – జనవరి 2027

20. మూలపల్లి లిఫ్ట్ – డిసెంబర్ 2027

21. మడకశిర బ్రాంచ్ కెనాల్ వైడెనింగ్ – డిసెంబర్ 2027

22. ఝంఝావతి రిజర్వాయర్ – డిసెంబర్ 2027

23. వేదవతి ఎత్తిపోతల పథకం – జూన్ 2028

24. భైరవాని తిప్ప – జూన్ 2028

25. అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్ – జూన్ 2028

26. జీఎన్ఎస్ఎస్ కెనాల్ (కడప వరకు) – జూన్ 2028

27. సోమశిల-స్వర్ణముఖి లింక్ – జూన్ 2028

28. శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ వైడనింగ్ – డిసెంబర్ 2028

29. తారక రామతీర్థ సాగర్ – డిసెంబర్ 2027

30. మహేంద్ర తనయ – జూలై 2027

31. గజపతినగరం బ్రాంచ్ కెనాల్ – జూలై 2027

32. గాలేరు-నగరి (కడప, కోడూరు వరకు) – డిసెంబర్ 2028

33. కోడూరు-బాలాజీ సాగర్ – డిసెంబర్ 2028

34. గోదావరి డెల్టా మోడ్రనైజేషన్ – జూన్ 2028

35. పెన్నా-సర్వేపల్లి – డిసెంబర్ 2026

36. వరికిపూడిసెల – డిసెంబర్ 2028

ANN TOP 10