AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ రెడీ.. ప్రారంభానికి డేట్ ఫిక్స్..!

సనత్‌నగర్ టిమ్స్‌లో జరుగుతున్న వైద్య సేవల ట్రయల్ రన్‌ను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు. హాస్పిటల్ లోని ఏ, బీ, సీ బ్లాకులన్నీ మంత్రి కలియ తిరిగారు. ఓపీ రిజిస్ట్రేషన్, ఐపీ వార్డులు, ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్, సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, ల్యాబులు, మెకనైజ్‌డ్ ల్యాండ్రీ, కిచెన్ తదితర అన్ని డిపార్ట్‌మెంట్లను మంత్రి మంగళవారం పరిశీలించారు.పెండింగ్ పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్‌ అండ్ బీ, ఆరోగ్యశాఖ అధికారులకు మంత్రి సూచించారు‌.

 

అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో..

హాస్పిటల్‌కు నీళ్లు, పవర్ సప్లైలో ఎలాంటి ఆటంకం ఉండకూడదని, 24 గంటల సరఫరా ఉండాలని మంత్రి సూచించారు. ఫైర్ సేఫ్టీ విషయంలో రాజీ ఉండకూడదని, అన్ని ఫ్లోర్లలో మరోసారి పూర్తిస్థాయి పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు‌. రిసెప్షన్ ఏరియా, హెల్ప్ డెస్క్, ఓపీ కౌంటర్లు, వెయిటింగ్ హాల్, ఓపీ కన్సల్టేషన్ రూమ్స్, డయాగ్నస్టిక్స్, ఇన్ పేషెంట్ వార్డులు, ఫార్మసీ తదితర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి.. రిజిస్ట్రేషన్ కౌంటర్స్, ఫార్మసీ కౌంటర్స్ పెంచాలని సూచించారు. సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, ఎక్స్ రే, ఆల్ట్రాసౌండ్ తదితర యంత్రాలను పరిశీలించిన మంత్రి.. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ యంత్రాలు పూర్తిస్థాయిలో పేషెంట్లకు ఉపయోగపడాలని, ఇందుకు అవసరమైన డాక్టర్లు, ఇతర సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.

 

ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్..

ప్రారంభం నాటికి అన్ని సౌకర్యాలతో హాస్పిటల్‌ను సిద్ధం చేయాలని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు‌.జూన్‌లో సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభిస్తామన్నారు. ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా వైద్య సేవల ట్రయల్ రన్ జరుగుతోందన్నారు. కొన్ని ఫినిషింగ్ వర్క్స్ జరుగుతున్నాయని, ఆ పనులన్నీ గడువులోగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించామన్నారు. ఇది వెయ్యి బెడ్ల హాస్పిటల్ అని, ఇందులో 300 ఎమర్జెన్సీ బెడ్లు ఉంటాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితుల ప్రాణాలు నిలిపే గొప్ప హాస్పిటల్‌గా దీన్నితీర్చి దిద్దుతున్నామన్నారు. గుండె సంబంధిత వ్యాధుల చికిత్సలు, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలకు ఈ హాస్పిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఉంటుందన్నారు. అంతేగాక ఇక్కడే‌ అద్భుతమైన రీసెర్చ్ సెంటర్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

ANN TOP 10