AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చరణ్ ప్లేస్ లో ధనుష్..? భన్సాలీ మూవీ పై క్రేజీ అప్డేట్..!?

మగధీరతో తొలిసారి టాలీవుడ్ కి 100 కోట్లు ఇచ్చాడు చరణ్, ఇక RRRతో తెలుగు సినిమాని ప్యాన్ వరల్డ్ స్టేజ్ కి తీసుకెళ్లిపోయాడు. అలాంటి చరణ్ క్రేజ్ ఇప్పుడు డేంజర్లో పడిందా అంటే అవుననే అంటున్నాయ్ బాలీవుడ్ సర్కిల్స్. అవును… మొదటగా భన్సాలీ ప్రొడక్షన్ లో పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కే ప్రెస్టేజియస్ మైథలాజికల్ జంగిల్ డ్రామా కోసం చరణ్ ని అప్రోచ్ అయ్యాడు అన్న వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.అయితే భన్సాలీ ఇప్పుడు చరణ్ ప్లేస్ ని కోలీవుడ్ మల్టీ టాలెంటెడ్ ధనుష్ తో ఫిల్ చేయబోతున్నాడన్న వార్తలు ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయ్.

 

చరణ్‌ను పక్కన పెట్టడానికి కారణం అదేనా?

 

నిజానికి RRR తర్వాత చరణ్ ఇమేజ్ స్కై లెవల్ కి వెళ్లిపోయింది. అయితే పెద్ది సినిమా విషయంలో జరుగుతున్న డిలే వల్లే భన్సాలీ తన మనసు మార్చుకున్నాడని బీ టౌన్ లో వినిపిస్తున్న టాక్.అసలే భన్సాలీకి సినిమాని అనుకున్న టైమ్ లో అనుకున్న విధంగా కంప్లీట్ చేస్తాడని పేరుంది. అలాంటి పర్ఫెక్షనిస్ట్ కి చరణ్ డేట్స్ విషయంలో జరుగుతున్న గందరగోళం వల్లే రిస్క్ చేయడం ఇష్టం లేక ధనుష్ వైపు చూస్తున్నాడని తెలుస్తుంది.

 

ధనుష్ ఎంట్రీ.. మెగా ఇమేజ్‌కు డ్యామేజ్?

 

నిజానికి భన్సాలీ ప్రొడ్యూస్ చేయబోయే మైథలాజికల్ జంగిల్ డ్రామాకి సాలిడ్ ఫిజిక్ అండ్ క్రేజీ కటౌట్ కావాలి. అలా చూస్తే ఈ సినిమాకి చరణే పర్ఫెక్ట్ చాయిస్.కానీ, భన్సాలీ మాత్రం రామ్ చరణ్ గ్లామర్ కంటే ధనుష్ నటనకే ఓటేశాడన్న అనుమానాలు కలుగుతున్నాయ్.నిజంగానే వినిపిస్తున్నట్టుగా చరణ్ ప్లేస్ లో ధనుష్ వస్తే మాత్రం అది చరణ్ స్టార్‌డమ్‌ను తక్కువ చేసి చూపించడమేనని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.మరో వైపు పీలగా ఉండే ధనుష్ చరణ్ స్థానాన్ని భర్తీ చేయడం ఏంటో అంటూ సోషల్ మీడియాలో డిబేట్స్ పెట్టేస్తున్నారు మెగా ఫ్యాన్స్.మరి నటనలో ధనుష్ కి వంక పెట్టే పని లేనప్పటికీ, ఒక మైథలాజికల్ విజువల్ వండర్‌కు ఆయన ఏ మేరకి సెట్ అవుతాడో చూడాలి.

 

వార్ మొదలైనట్లేనా?

 

ఇక చరణ్ ప్లేస్ ని ధనుష్ కబ్జా చేశాడు అన్న వార్తలు బయటికి రావడంతో ఫైర్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్.పనిలో పనిగా చరణ్ ని పక్కన పెట్టి ధనుష్ ని క్యాస్ట్ చేయడం వెనుక ఏదో కుట్ర ఉందంటూ విశ్లేషించడం కూడా మొదలెట్టారు.మరో వైపు ఈ భారీ ప్రాజెక్ట్ లో హీరోని మార్చడం అంటే డేట్స్ ప్రాబ్లం మాత్రమే కాదని, హీరో డిమాండ్ కూడా తగ్గిపోవడమే అంటూ ట్రోల్ చేస్తున్నారు యాంటి ఫ్యాన్స్.

 

ఏది ఏమైనా భన్సాలీ ప్రొడక్షన్ లో రాబోతున్న ఈ జంగిల్ డ్రామా నుండి చరణ్ తప్పుకుంటే మాత్రం మెగా ఫ్యాన్స్ కి డైజెస్ట్ కాని అంశమే.చూడాలి మరి ధనుష్ కి ఈ సినిమా ఏ మేరకి కలిసి వస్తుందో!

ANN TOP 10