మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా(Peddi Movie) పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చివరి దశ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా స్పెషల్ సాంగ్ షూటింగ్ కూడా పూర్తి అయిందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకోబోతోంది. ఇక పెద్ద సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ జూన్ నెలలో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా జూన్ లో విడుదల కాబోతుందని తెలిపారు కానీ ఎప్పుడు విడుదలవుతుందనే విషయాలను మాత్రం తెలియజేయలేదు.
జూన్ 25న పెద్ది విడుదల?
ఇకపోతే ఇటీవల ఓ సినిమా వేడుకలో పాల్గొన్న డైరెక్టర్ బుచ్చి బాబు(Bucchi Babu) పెద్ది సినిమా జూన్ 25వ తేదీ రాబోతుంది అంటూ తెలియజేశారు కానీ అధికారకంగా ఇప్పటివరకు మాత్రం వెల్లడించలేదు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అంటూ అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఇందులో రామ్ చరణ్ రెండు విభిన్న మైనటువంటి పాత్రలలో కనిపించబోతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి.
మూడు విన్నమైన పాత్రలలో చరణ్..
రామ్ చరణ్ ఇందులో క్రికెట్ నేపథ్యంలో సాగే కథలో ఒక పాత్రలోనూ అలాగే ఇటీవల విడుదల చేసిన టీజర్ లో భాగంగా కుస్తీ పోటీలకు సంబంధించి విడుదల చేశారు అయితే ఇక్కడ ఒక పాత్రలో కనిపించబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వచ్చే ఇలా రెండు విభిన్న పాత్రలలో రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉంటుందని అభిమానులు భావించారు కానీ ఈ సినిమాలో రామ్ చరణ్ మరో పాత్రలో కూడా కనిపించబోతున్నారంటూ వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ పాత్ర మాత్రం అభిమానులకు చాలా సర్ప్రైజ్ గా ఉండబోతుందని తెలుస్తోంది.
టాక్సిక్ వాయిదా.. పెద్ది రాబోతోందా?
ఇక రాంచరణ్ ఈ సినిమాలో మూడో పాత్రలో ఏ విధంగా కనిపించనున్నారు ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది అనేది తెలియాలి అంటే ఎదురు చూడాల్సిందే. ఈ సినిమా జూన్ 25వ తేదీ విడుదల కాబోతుందని డైరెక్టర్ చెప్పారు కానీ తాజాగా యశ్ హీరోగా నటించిన టాక్సిక్ సినిమా జూన్ 4 నుంచి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వాయిదా పడడంతో రామ్ చరణ్ పెద్ది సినిమాని జూన్ 4వ తేదీ విడుదల చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 4న కాకుండా 25న విడుదల చేస్తే తిరిగి 26వ తేదీ విడుదల కాబోతున్న అఖిల్ లెనిన్ సినిమా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే జూన్ 4న పర్ఫెక్ట్ రిలీజ్ టైం అంటూ అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ తేదీని పెద్ది టీం సద్వినియోగం చేసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.








