AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘మెగా 158’ నుంచి క్రేజీ అప్‌డేట్..!

బాక్సాఫీస్ కా బాస్ అని మన శంకర వరప్రసాద్‌తో మరోసారి ప్రూవ్ చేసుకున్న చిరు, ఇప్పుడు మరో సినిమాని పరుగులు పెట్టించేందుకు రెడీ అయిపోయాడు. వాల్తేరు వీరయ్య లాంటి సాలిడ్ సక్సెస్ ఇచ్చిన బాబీ కొల్లితో మెగా 158కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక వీరి కాంబోలో ఇదివరకే ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్‌బస్టర్ రావడంతో అంచనాలు స్కైలెవెల్‌లో పెట్టేసుకున్నారు అందరూ.

వీటన్నింటికి చెక్ పెడుతూ క్రేజీ అప్‌డేట్

 

నిజానికి ఈ సినిమాకి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చాలాకాలమే అయ్యింది. అయితే సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది అన్న టైమ్‌లో KVN బ్యానర్‌లో నిర్మించిన జననాయగన్ చుట్టూ సెన్సార్ ఇబ్బందులు చుట్టుముట్టడంతో ఈ సినిమా అనుకున్న సమయానికి మొదలుకాలేకపోయింది. దీంతో సినిమా ఇక ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లడం కష్టమే అన్న టాక్ సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అయింది. అయితే ఈ రూమర్స్‌పై ఎప్పటికప్పుడు మేకర్స్ ఖండించినా గాసిప్స్ మాత్రం ఆగని పరిస్థితి. అయితే తాజాగా వీటన్నింటికి చెక్ పెడుతూ క్రేజీ అప్‌డేట్ వదిలింది మూవీ టీమ్.

 

లుక్ టెస్ట్ పూర్తి.. ‘హింసకు ముందు నిశ్శబ్దం’!

 

ఈ రోజే అంటే మంగళవారం మెగా 158 సినిమాకి సంబంధించిన లుక్ టెస్ట్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి అయిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది KVN ప్రొడక్షన్. ఇక షేర్ చేసిన ఫోటోకి ‘హింసకు ముందు నిశ్శబ్దం’ (Silence Before The Carnage) అనే క్యాప్షన్ పెట్టడంతో చిరు నుంచి వైలెంట్ మాస్ ఎంటర్‌టైనర్ చూడబోతున్నామంటూ మురిసిపోతున్నారు మూవీ లవర్స్.

 

సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధం..

 

ఇక చిరు విషయానికి వస్తే వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వంభర సినిమా డబ్బింగ్ పనుల్లో యమా బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఇది కంప్లీట్ కాగానే చిరు సినిమా పరుగులు పెట్టనుందన్న మాట. ఇక దీని తర్వాత ఎలాగూ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమా లైన్‌లో ఉండనే ఉంది. మొత్తానికి ఏడు పదులు దాటినా వరుస సినిమాలతో కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడన్న మాట. ఇక ఈ ‘మెగా 158’ సినిమా పూజా కార్యక్రమం తో పాటు సెట్స్ పైకి వెళ్లే రోజుని త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారట.

 

సర్క్యులేట్ అవుతున్న రూమర్స్

 

ఇక ఈ సినిమా పేరు ‘కాకాజీ’ అని ఫిక్స్ చేశారని, బెంగాల్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాని మరో రేంజ్‌కి తీసుకెళ్తాయన్న వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. వీటికి తోడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్నాడని, చిరంజీవి జోడీగా ప్రియమణి, మిగతా కీలక పాత్రల్లో మోహన్ లాల్, అనురాగ్ కశ్యప్ వంటి స్టార్ యాక్టర్స్ నటించబోతున్నారన్న రూమర్స్ తెగ సర్క్యులేట్ అవుతున్నా మేకర్స్ క్లారిటీ ఇవ్వని పరిస్థితి.

 

ఏది ఏమైనా లేటెస్ట్‌గా మేకర్స్ వదిలిన ఈ అప్‌డేట్‌తో సినిమా ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగుతుందన్న క్లారిటీ అయితే వచ్చేసింది. చూడాలి మరి మిగతా క్యాస్టింగ్ విషయంలో అయినా త్వరలో ఏమైనా మేకర్స్ నుండి అప్‌డేట్ వస్తుందేమో!

ANN TOP 10