AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బుచ్చి బాబు డైరెక్షన్లో సూపర్ స్టార్..?

టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి కాంబినేషన్లో ‘వారణాసి’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఎప్పుడు ఎప్పుడు థియేటర్లలో చూస్తామని ప్రిన్స్ అభిమానులతో పాటుగా మూవీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. దాదాపు 70 శాతం కు పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చేయడాది ప్రేక్షకులు ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు మహేష్ బాబు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు ఎవరితో సినిమాలు చేయబోతున్నాడు అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. మరి మహేష్ బాబు ఏ డైరెక్టర్లకు తర్వాత చాన్స్ ఇవ్వబోతున్నాడు ఒకసారి మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

 

మహేష్ బాబు అప్ కమింగ్ సినిమాలు..

ఏ హీరో అయిన రాజమౌళితో సినిమాలు చేయాలి అంటే వేరే సినిమాల కమిట్మెంట్లు లేకుండా చూసుకోవాలి అని అందరికీ తెలిసిందే.. ఈ మూవీ పూర్తయ్యేంతవరకు కొత్త సినిమాలకు సైన్ కూడా చేయరు. ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి సినిమా దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చింది.. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీ తర్వాత మహేష్ బాబు ఎవరితో సినిమా చేస్తాడు అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ‘ఏషియన్ సునీల్’ ప్రొడక్షన్స్ లో ఒక సినిమా చేయడానికి సైన్ చేసినట్లు తెలుస్తుంది. గతంలో మహేష్ తో ఈ సంస్థ ‘శ్రీమంతుడు’, ‘సర్కారు వారి పాట ‘ వంటి చిత్రాలు నిర్మించింది. అయితే ఈ చిత్రానికి డైరెక్టర్ ఇంకా ఖరారు కాలేదు. బుచ్చి బాబు సనా తో మహేష్ తదుపరి సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే యానిమల్ తో భారీ ప్రభంజనాన్ని క్రియేట్ చేసుకున్న సందీప్ రెడ్డి వంగాతో ఓ మూవీ చెయ్యనున్నాడని ఇండస్ట్రీలో టాక్.. ఈ సినిమాల గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..

 

వారణాసి మూవీ అప్డేట్…

ఇక వారణాసి సినిమా విషయానికొస్తే.. రీసెంట్ గానే మహేష్ బాబు , ప్రియాంక చోప్రా లపై గ్రాండ్ స్కేల్ లో ఒక సాంగ్ ని చిత్రీకరించారు. ఈ పాటలో వీరిద్దరి మధ్య వచ్చే స్టెప్పులు కాస్త యూనిట్ గా ఉంటాయని తెలుస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే మరోసారి నాటు నాటు పాటని చూస్తారని చిత్రయూనిట్ అంటున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంది. గతంలో ఎన్నడు కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేష్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. రాజమౌళి లాంటి గొప్ప డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కిస్తుండటంతో దీనిపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.. మరి అభిమానుల అంచనాలను రాజమౌళి రీచ్ అవుతాడా లేదా తెలియాలంటే ఇంకొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే..

ANN TOP 10