AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పెద్దపల్లి జిల్లాలో దారుణం..! చిన్నారిని పీక్కుతిన్న వీధికుక్కలు..

తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో వీధికుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. దివ్యా బెహ్రా అనే బాలిక తమ ఇంటి ముందు వీధిలో ఆడుకుంటోంది. ఈ సమయంలో బాలికపై కుక్కలు దాడి చేశాయి.

 

కుక్కలు బాలికను నోట కరుచుకుని పొలాల్లోకి తీసుకువెళ్లాయి. ఈ క్రమంలో కుక్కలు పీక్కుతినడంతో తీవ్రగాయాలతో చిన్నారి మృతి చెందింది. చిన్నారి తల్లిదండ్రులు ఒడిశా నుంచి వచ్చి ఇటుకబట్టీల్లో పని చేస్తున్నారు. తమ ప్రాంతంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ హృదయ విదారకమైన ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంంది.

ANN TOP 10