AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వారణాసి నుండి బిగ్ అప్డేట్..!

దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli ) అంతర్జాతీయ ప్రమాణాలతో ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందిస్తున్న చిత్రం వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు(Maheshbabu ) హీరోగా , గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra)హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ దర్శకుడు, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) విలన్ గా కుంభ పాత్ర పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగు శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్ షెడ్యూల్ కి సంబంధించి ఒక అప్డేట్ అభిమానులలో అంచనాలు పెంచేయడమే కాకుండా గూస్ బంప్స్ తెప్పిస్తోందని చెప్పవచ్చు.

 

దేవర కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ నేతృత్వంలో సాంగ్ చిత్రీకరణ..

వారణాసి సినిమాకు సంబంధించిన కీలకమైన సాంగ్ షూటింగ్ ను ఇప్పుడు హైదరాబాదులో చిత్రీకరించనున్నారు. ఇందుకోసం హైదరాబాదులో ప్రత్యేకంగా భారీ సెట్ కూడా వేశారు. పైగా నృత్య రీతులు నేర్పించడానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. విభిన్నమైన కాలాల (Eras) నేపథ్యంలో సాగే ఈ ఆసక్తికరమైన కథలో మహేష్ బాబు శ్రీరాముడు, రుద్ర అనే రెండు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇక ఈ పాట చిత్రీకరణ తర్వాత చిత్ర బృందం మే నెలలో విరామం తీసుకుని.. మళ్లీ జూన్ నుండి తదుపరి షెడ్యూల్ను ప్రారంభించనుంది. ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

 

మొత్తానికి అయితే హైదరాబాద్లో భారీ సెట్ వేశారని.. పైగా ప్రముఖ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ నేతృత్వంలో ఈ సాంగ్ చిత్రీకరణ జరగబోతుందని తెలియడంతో అభిమానులు ఆ పాట కోసం చాలా ఎక్సైట్ గా ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా వారణాసి నుండి వస్తున్న ఒక్కో అప్డేట్ ఒక్కో ఆణిముత్యం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే ఈయన గతంలో ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాలోని పాటలకు కొరియోగ్రఫీ అందించిన విషయం తెలిసిందే.

 

వారణాసి మూవీలో మినీ తారక్.. నిజమేనా?

వారణాసి సినిమా విషయానికి వస్తే.. దుర్గా ఆర్ట్స్ , షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై డాక్టర్ కే ఎల్ నారాయణ, ఎస్ ఎస్ కార్తికేయ ఈ సినిమాను సుమారుగా 1000 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుండీ కేవలం 3 పాత్రలను మాత్రమే రివీల్ చేశారు. మరి ఇందులో ఏ పాత్రలో ఎవరు నటించబోతున్నారు అన్నది పూర్తిగా సస్పెన్స్ అనే చెప్పాలి. మరొకవైపు ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ్ రామ్ నటించబోతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

 

ఈ విషయం ఎన్టీఆర్ అభిమానులను సంతోషపరిచినప్పటికీ దీనిపైన ఎటువంటి ఆధారాలు లేకపోవడం గమనార్హం. ఒకవేళ ఇదే గనుక నిజమైతే ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. మరి నిజంగానే భార్గవ్ రామ్ ను ఈ సినిమాలో భాగం చేయబోతున్నారా అనే ప్రశ్న కి సమాధానం తెలియాల్సి ఉంది . ఇకపోతే ఇప్పటికే భార్గవ్ రామ్ ను మినీ తారక్ అని , రాజమౌళి చిత్రానికి అవసరమైన భావోద్వేగ లోతుకు సహజంగా సరిపోతాడని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వాలని కూడా కోరుతూ ఉండడం గమనార్హం.

ANN TOP 10