ఒకప్పుడు తెలుగు సినిమా వంద కోట్లు అయినా దాటుతుందా అన్న అనుమానాల నుండి నేడు కేవలం OTTల నుండే వంద కోట్లపై బడి కొల్లగొడుతుందంటే తెలుగు సినిమా ఏ రేంజ్ కి వెళ్లిందో అర్థమైతుంది.తాజాగా అలాంటి ఓ సాలిడ్ డీల్ నే పెద్ది చేసుకుందన్న వార్త మీడియాలో తెగ హైలెట్ అవుతుంది. యస్…ఉప్పెన తో సూపర్ హిట్ కొట్టిన బుచ్చిబాబు సన,గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో సినిమా అనగానే అంచనాలు పెట్టేసుకున్న ట్రేడ్ పండిట్స్ కి ఇపుడు సినిమాకి వస్తున్న బిజినెస్ డీల్స్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుందట.
మాములుగా సినిమా రిలీజ్ అయ్యాక OTT డీల్ కోట్ చేస్తుంటారు.కాని పెద్ది కున్న క్రేజ్ కారణంగా ఇంకా షూటింగ్ స్టేజ్ లో ఉండగా,కేవలం డిజిటల్ రైట్స్ ద్వారానే ఒక భారీ బడ్జెట్ సినిమాకు కావాల్సిన రికవరీ వచ్చేస్తుందంటే చరణ్ మార్కెట్ స్టామినా ఏ రేంజ్‌కు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.అయితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ. 130 కోట్ల భారీ చెక్కును ఆఫర్ చేయడం వెనుక చాలా పెద్ద ప్లానే ఉందట. అవును ఇది సౌత్ ఇండియాలోని నాలుగు ప్రధాన భాషలతో పాటు, హిందీ మార్కెట్‌ను కూడా ఈ డీల్ కవర్ చేస్తోందని తెలుస్తుంది. RRR తర్వాత నార్త్ బెల్ట్‌లో రామ్ చరణ్‌కు ఏర్పడిన మాసివ్ ఫాలోయింగ్, అలాగే బుచ్చిబాబు సన ‘ఉప్పెన’తో వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం వంటివి నెట్‌ఫ్లిక్స్‌ను ఇంత భారీ పెట్టుబడి పెట్టేలా చేశాయని ఇన్ సైడ్ టాక్.ముఖ్యంగా రామ్ చరణ్ ఈ చిత్రంలో ‘పెద్ది పహిల్వాన్’గా కనిపిస్తున్న రా అండ్ రస్టిక్ లుక్, ఆ గ్లింప్స్ చూసిన తర్వాత హిందీ బెల్ట్‌లో కూడా సినిమాని చూసేయ్యాలన్న క్యూరియాసిటీ పెరిగిందని సమాచారం.
నెట్‌ఫ్లిక్స్ హిస్టరీలో ఇది రేర్ అగ్రిమెంట్
అయితే ఈ డీల్ 130 కోట్ల వరకే ఆగిపోలేదండోయ్..సినిమా థియేటర్లలో సాధించే సక్సెస్ బట్టి, అంటే బాక్సాఫీస్ వద్ద సినిమా వసూల్ చేసే కలెక్షన్స్ బట్టి ఎక్స్ట్రాగా మరో రూ. 20 కోట్ల బోనస్ మొత్తాన్ని నిర్మాతలకు చెల్లిస్తారట. దీన్నే ‘సక్సెస్ ఇన్సెంటివ్’ క్లాజ్! అంటారు. ఒకరకంగా నెట్‌ఫ్లిక్స్ హిస్టరీలో ఇది రేర్ అగ్రిమెంట్ అనే చెప్పాలి.అంటే ఈ ‘పెద్ది’ పహిల్వాన్ గనుక థియేటర్లలో రికార్డులని మడతెట్టేస్తే టోటల్ డిజిటల్ బిజినెస్ వాల్యూ ఏకంగా రూ. 150 కోట్లకు చేరుతుందన్న మాట. ఏది ఏమైనా ఒక తెలుగు సినిమాకు కేవలం ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి ఈ రేంజ్ లో ఆఫర్ రావడం అంటే అది చరణ్ గ్లోబల్ క్రేజ్‌కు దక్కిన గౌరవం అనే చెప్పాలి.
పహిల్వాన్ – ఆధునిక క్రికెటర్
ఇక కంటెంట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రామ్ చరణ్ తో రెండు విభిన్నమైన షేడ్స్‌లో ఈ పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కిస్తున్నాడట బుచ్చిబాబు.ఉత్తర కోస్తా ఆంధ్ర బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథలో ఒకటి గంభీరమైన ‘పెద్ది పహిల్వాన్’ పాత్ర అయితే, మరొకటి ఆధునిక క్రికెటర్ పాత్ర అని ఇన్ సైడ్ టాక్ . ఇక ఈ రెండింటి మధ్య ఉండే ఎమోషనల్ జర్నీనే సినిమాకు మెయిన్ పిల్లర్ అని తెలుస్తోంది.వీరితో పాటు కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ ఒక కీలకమైన పాత్రలో కనిపిస్తుండటం సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్ అయితే, మలయాళ నటుడు ఆంటోనీ వర్గీస్ కూడా ఒక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించడం సినిమాపై అంచనాలను పెంచేదే.
ఏప్రిల్ 30న రిలీజ్ డేట్ ?
ఇక ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ , జాన్వీ కపూర్ గ్లామర్ ఈ చిత్రానికి మరింత అట్రాక్షన్ యాడ్ చేసేవే. చూడాలి మరి ఇప్పటికే ఏప్రిల్ 30న రిలీజ్ డేట్ అని మేకర్స్ అంటున్నారు కాని ఫ్యాన్స్ లోనే ఫుల్ డైలమా రన్ అవుతుంది,మొత్తానికి రిలీజ్‌కు ముందే ‘పెద్ది’ సెట్ చేస్తున్న ఈ రికార్డులని చూస్తుంటే రిలీజ్ అయ్యాక ఇంకెన్ని రీ రైట్ చేస్తాడా అని క్యూరియస్ గా వాచ్ చేస్తున్నారు మూవీ లవర్స్.








