AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చిరు గిఫ్ట్ ఇచ్చిన కారుపై హరీశ్ శంకర్ సరదా ట్వీట్: “ఉస్తాద్ భగత్ సింగ్ పాట వింటూ షికారు చేద్దాం!”

సంక్రాంతి కానుకగా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో, మెగాస్టార్ చిరంజీవి ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడికి ఒక ఖరీదైన స్పోర్ట్స్ కారును బహుమతిగా ఇచ్చారు. తన ఆరాధ్య దైవం నుంచి అందిన ఈ అరుదైన కానుకను అనిల్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ మురిసిపోయారు. ఇది తన జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకమని ఆయన పేర్కొన్నారు.

అనిల్ రావిపూడి ట్వీట్‌పై దర్శకుడు హరీశ్ శంకర్ ఎంతో ఫన్నీగా స్పందించారు. “తమ్ముడూ… త్వరగా ఆ కారేసుకుని నా దగ్గరకు రా! అందులో కూర్చుని ఉస్తాద్ భగత్ సింగ్ (UBS) కొత్త సాంగ్ వింటూ అలా డ్రైవ్ వెళ్దాం. నీకు నా గిఫ్ట్ ఇదే!” అంటూ సరదాగా కామెంట్ చేశారు. పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి, ఇప్పుడు ఈ ట్వీట్‌తో సినిమా పాట గురించి హింట్ ఇవ్వడం మెగా అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.

ఈ ఇద్దరు స్టార్ డైరెక్టర్ల మధ్య జరిగిన ఈ ఫన్నీ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవైపు సంక్రాంతి బ్లాక్‌బస్టర్ విజయం, మరోవైపు పవన్ కల్యాణ్ సినిమా అప్‌డేట్.. రెండింటినీ మిక్స్ చేస్తూ హరీశ్ శంకర్ చేసిన ట్వీట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చిరంజీవి తన దర్శకులను ఇలా గౌరవించడంపై మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ANN TOP 10