AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఢిల్లీ పేలుడు ప్రభావం: బాలానగర్ ప్రాంతంలో హై అలర్ట్, విస్తృత తనిఖీలు

ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థలను కదిలించింది, ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ సూచనల మేరకు అన్ని రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్‌లోని పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు, ముఖ్యంగా సైబరాబాద్ పరిధిలోని రద్దీ ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.

సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మొహంతి ఆదేశాల మేరకు బాలానగర్ సీఐ నర్సింహా రాజు నేతృత్వంలో బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ మరియు ఇంటెలిజెన్స్ బృందాలతో కలిసి విస్తృత తనిఖీలు చేపట్టారు. ఐడీపీఎల్ డీమార్ట్, విమల థియేటర్, రాజుకాలనీ, సాయినగర్, నర్సాపూర్ చౌరస్తా వంటి రద్దీ ప్రాంతాల్లో పోలీస్ బృందాలు సోదాలు నిర్వహించి, ప్రజల భద్రత దృష్ట్యా ప్రతి వాహనం, బ్యాగ్, అనుమానాస్పద వస్తువును జాగ్రత్తగా పరిశీలించాయి.

ఈ తనిఖీలతో పాటు స్థానిక ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భద్రతా చర్యలు కేవలం ఒక రోజు కార్యక్రమం కాదని, పరిస్థితి పూర్తిగా సాధారణం అయ్యే వరకు ఈ తనిఖీలు కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

ANN TOP 10