AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న రామ్‌చరణ్‌-ఉపాసన దంపతులు

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతుండటంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ సంతోషకరమైన విషయాన్ని తెలియజేస్తూ ఉపాసన తన సోషల్ మీడియాలో ఒక మెమరబుల్ వీడియోను షేర్ చేశారు. “ఈ దీపావళి మా ఇంట్లో ఆనంద దీపావళి. మా సంతోషాన్ని, ఆనందాన్ని రెట్టింపు చేసింది. అందరి ఆశీస్సులు, ఆశీర్వచనాలు మాకు అందాయి” అంటూ ఉపాసన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ క్యూట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉపాసన షేర్ చేసిన  వీడియోలో రామ్ చరణ్, ఉపాసన దంపతులకు వారి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. నాగేంద్రబాబు, నిహారిక కొణిదెల, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వంటి కుటుంబ సభ్యులతో పాటు, ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలకు హాజరైన అగ్ర కథానాయకులు వెంకటేష్, నాగార్జున, నయనతార ఫ్యామిలీ కూడా ఈ వీడియోలో ఉపాసనను ఆశీర్వదిస్తూ కనిపించారు. ఈ శుభవార్త సెలబ్రేషన్స్ దీపావళి రోజే జరిగాయని వీడియో చూస్తే తెలుస్తోంది.

2012లో వివాహం చేసుకున్న రామ్ చరణ్, ఉపాసన దంపతులకు 2023లో కూతురు క్లీంకార జన్మించిన సంగతి తెలిసిందే. క్లీంకార పుట్టిన ఏడాది తర్వాతే వారు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న శుభవార్తను పంచుకోవడంతో అభిమానులు, సినీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ANN TOP 10