AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మంచు మనోజ్‌దే తప్పు.. మనోజ్‌ తల్లి సంచలన లేఖ విడుదల

మంచు ఫ్యామిలీ వివాదంలో మరో బిగ్‌ ట్విస్ట్‌

మంచు ఫ్యామిలీ వివాదంలో మరో బిగ్‌ ట్విస్ట్‌.. మంచు మనోజ్‌ దే తప్పు అంటూ మోహన్‌ బాబు భార్య, మంచు మనోజ్‌ తల్లి నిర్మల అధికారికంగా పోలీసులకు లెటర్‌ విడుదల చేశారు. సంచలన లేఖతో సర్వత్రా హాట్‌టాపిక్‌గా మారింది. కొన్ని రోజులుగా మంచు కుటుంబలో వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్‌ వర్సెస్‌ మోహన్‌ బాబు, విష్ణు అన్నట్టు ఈ వివాదాలు నడుస్తున్నాయి. ఈ వివాదాలు పోలీసుల వరకు వెళ్లడం, ఇంటి ముందు బౌన్సర్లు పెట్టి గొడవలు చేయడం.. ఇలా సాగుతూనే ఉన్నాయి. ఇటీవల మోహన్‌ బాబు తన గన్‌ ని కూడా పోలీసులకు అప్పగించారు. మంచు మనోజ్‌ ఆళ్లగడ్డ వెళ్ళిపోయాడు. దీంతో గొడవ సద్దుమణుగుతుంది అనుకున్నారు. కానీ తాజాగా మోహన్‌ బాబు భార్య, మంచు మనోజ్‌ తల్లి నిర్మల అధికారికంగా పోలీసులకు ఓ లెటర్‌ ని విడుదల చేసింది. ఈ లెటర్‌ లో మంచు మనోజ్‌ కి వ్యతిరేకంగా తల్లి రాయడంతో ప్రస్తుతం ఈ లేఖ సంచలనంగా మారింది.

లేఖలో ఇలా ఉంది..
పోలీసులకు విడుదల చేసిన లెటర్‌ లో మనోజ్‌ తల్లి నిర్మల..‘నేను మోహన్‌ బాబు భార్య మంచు నిర్మలా మోహన్‌ బాబు. జల్పల్లిలో ఉంటున్నాను. డిసెంబరు 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు అయిన విష్ణు మంచు జల్పల్లి ఇంటికి వచ్చి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్‌ చేసాడు. దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్‌.. ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజీని బయట పెట్టి, దాన్ని విష్ణు గొడవ చేసినట్టు లేనిపోని అభాండాలు వేసి పోలీస్‌ కంప్లయింట్‌ ఇచ్చినట్టు తెలిసింది. నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే, నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్‌ తీసుకుని ఇంటికి వచ్చాడు. అలాగే తన రూములో ఉన్న సామాను తీసుకున్నాడు. ఉన్న కొద్దిసేపు నాతోటి ఉండి కేక్‌ కట్‌ చేయించి సెలబ్రేట్‌ చేసాడు, నా చిన్న కొడుకైన మనోజ్‌ కి ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో, అలాగే నా పెద్ద కొడుకు అయిన విష్ణుకి కూడా అంతే హక్కు ఉంది. నా పెద్ద కొడుకు అయిన విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ, మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్‌ కంప్లయింట్‌ చేసిన దానిలో నిజం లేదు. ఈ ఇంట్లో పని చేసే వాళ్లు కూడా మేమిక్కడ పని చేయలేమని వాళ్లే మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం ఎంతమాత్రం లేదు. విష్ణు మా జల్పల్లి ఇంటికి వచ్చాడు, నా పుట్టిన రోజు సెలబ్రేట్‌ చేశాడు, విష్ణు గదిలో వున్న తన సామాను తీసుకున్నాడు, వెళ్లిపోయాడు. అంతకు మించి ఇక్కడ జరిగింది ఏమీ లేదు మీకు తెలియచేస్తున్నాను’ అని తెలిపారు. మరి దీనిపై పోలీసులు, మంచు మనోజ్‌ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10