AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సారు.. షి‘కారు’!.. కారు నడిపిన కేసీఆర్‌

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కారు నడిపిన ఫొటోలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుకు పట్లోళ్ల కార్తీక్‌ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని కేసీఆర్‌ కారు నడిపారు. ఇద్దరు కలిసి పంట పొలాలను పరిశీలించారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌ కావడంతో.. మళ్లీ ప్రజల్లోకి వచ్చే సంకేతాలు గులాబీ బాస్‌ ఇస్తున్నారని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. పులి బయటకు వస్తోందని బీఆర్‌ఎస్‌ శ్రేణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. శనివారం ఎర్రవెల్లి ఫామ్స్‌ వద్ద పాలకుర్తి నయోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో కేసీఆర్‌ సమావేశం అయ్యారు. మొదటి సారి రాజకీయ పరమైన అంశాలను చర్చించారు. వచ్చే ఎన్నికల్లో 100 శాతం మనమే అధికారంలోకి వస్తామని ప్రకటించారు.

 

ANN TOP 10