AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల.. 36 రోజుల తర్వాత..!

అత్యాచార ఆరోపణలతో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఇటీవల బెయిల్ రావడంతో.. తాజాగా చంచల్‌గూడ జైలు నుంచి బయటికి వచ్చారు. తెలంగాణ హైకోర్టు.. గురువారం బెయిల్ మంజూరు చేయగా.. శుక్రవారం బెయిల్‌పై బయటికి వచ్చారు. తన వద్ద పనిచేసే మైనర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై జానీ మాస్టర్ పలుమార్లు అత్యాచారం చేశారనే ఆరోపణలతో.. బాధితురాలు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.

అవకాశాల పేరుతో తనను బెదిరించి జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక దాడి చేశారని ఆయన దగ్గర పనిచేస్తున్న డ్యాన్సర్ సెప్టెంబర్ 15వ తేదీన నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జానీ మాస్టర్‌పై పోక్సో కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు.. గత నెల 19వ తేదీన అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి.. చంచల్‌గూడ జైలుకు పంపించారు. తాజాగా జైలు నుంచి బయటికి వచ్చిన జానీ మాస్టర్.. జైలు జీవితాన్ని నేర్పించిందని పేర్కొన్నారు.

ANN TOP 10