అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరైంది. తెలంగాణ హైకోర్టు.. జానీ మాస్టర్ కు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. నెల రోజుల క్రితం నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేయగా రెండు వారాలుగా చంచల్‌గూడ జైల్లో ఉన్నారు
ఇదిలాఉండగా.. పది రోజుల క్రితం నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం జానీ మాస్టర్‌కు రంగారెడ్డి కోర్టు ఐదు రోజుల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. కానీ ఫొక్సో చట్ట కింద జానీ మాస్టర్ అరెస్టు అయిన నేపథ్యంలో ఆయనకు వచ్చిన అవార్డును కమిటీ తాత్కాలికంగా నిలిపివేయడంతో తనకు వచ్చిన బెయిల్‌ను రద్దు చేసుకుని జానీ మాస్టర్ జైలుకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే ఈ సారి హైకోర్టులో బెయిల్ కోసం అప్పీల్ చేయగా తెలంగాణ హైకోర్టు.. రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది.









