AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి మృతి.. జమ్మికుంటలో విషాదం

కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి కన్నుమూసింది. అప్పటివరకూ కళ్లెదుటే ఆడుకున్న కూతురు అకస్మాత్తుగా విగతజీవిగా పడి పోవడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటకు చెందిన రాజు-జమున దంపతులకు ఉక్కులు (5) అనే కూతురు ఉంది. మంగళవారం ఉదయం నిద్రలేచిన బాలిక కాసేపు ఆడుకున్న తర్వాత కళ్లు తిరుగుతున్నాయని తల్లికి చెప్పింది. దీంతో బాలికను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు.. పరిస్థితి విషమంగా ఉండటంతో హన్మకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు.

దీంతో హుటాహుటిన బాలికను హన్మకొండకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షిస్తుండగానే చిన్నారి మృతి చెందింది. కాగా, చిన్నారికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని.. ఆ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించలేకపోయారని వైద్యులు తెలిపారు. అందువల్లే గుండెపోటు వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె మరణవార్త వినగానే ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. గుండెపోటుతో చిన్నారి మృతిచెందిందని తెలియడంతో జమ్మికుంటలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10