AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హీరో రవితేజకు సర్జరీ.. హాస్పిటల్ బెడ్‌పై ఇలా ..

మాస్ మహారాజా రవితేజ  హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న పిక్ ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ పిక్ చూసిన రవితేజ అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని డాక్టర్స్ చెబుతున్నారు. అసలు విషయం ఏమిటంటే.. భాను భోగవరపు  దర్శకత్వంలో ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ తన 75వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా షూట్‌లో చిన్న ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రవితేజ కుడిచేతి కండరాలు చిట్టించినట్లుగా తెలుస్తోంది. అయినా సరే లెక్క చేయకుండా రవితేజ షూట్‌లో పాల్గొనడంతో.. గాయం మరింత ఎక్కువవడంతో.. వెంటనే ఆయన హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్‌‌లో జాయిన్ అయ్యారు.

రవితేజని గాయాన్ని పరిశీలించిన డాక్టర్స్.. వెంటనే ఆయనకు సర్జరీ చేయాలని చెప్పి.. అందుకు తగిన ఏర్పాట్లను చేశారు. ప్రస్తుతం రవితేజకు సర్జరీ పూర్తయింది. గత కొన్ని రోజులుగా ఆయన విశ్రాంతి లేకుండా షూటింగ్స్ చేస్తుండటంతో పాటు, ఇప్పుడీ సర్జరీ.. మొత్తంగా ఆయనకు ఆరు వారాల పాటు బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్స్ సూచించారని తెలుస్తోంది. ఇక రవితేజ సర్జరీకి సంబంధించి ఓ పిక్ సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ పిక్ చూసిన వారంతా రవితేజకు చిన్న ప్రమాదం కాదు.. పెద్ద ప్రమాదమే జరిగింది అనేలా కామెంట్స్ చేస్తూ.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

ANN TOP 10