AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవ్‌ పార్టీలో అడ్డంగా దొరికిన బిగ్‌బాస్‌ ఫేమ్‌!

ఘట్‌కేసర్‌లోని కాంటినెంటల్‌ రిసార్ట్స్‌పై టాస్క్‌ఫోర్స్‌ దాడులు
పలువురు సెలబ్రిటీల హాజరు.. కేసులు నమోదు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌)
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రేవ్‌ పార్టీలపై పోలీసులు ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు. తాజాగా ఘట్‌కేసర్‌ మండల పరిధిలోని అంకుషాపూర్‌లో ది కాంటినెంటల్‌ రిసార్ట్స్‌పై జిల్లా ఎక్సైజ్‌ టాస్కోఫోర్స్‌ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడుల్లో బిగ్‌బాస్‌ ఫేమ్‌ మహబూబ్‌ షేక్‌ అడ్డంగా దొరికినట్లుగా తెలుస్తోంది. అతడి పుట్టిన రోజు సందర్భంగా రిసార్ట్స్‌లో రేవ్‌ పార్టీ నిర్వహించారని, ఆ పార్టీకి బుల్లితెర నటులు, సెలబ్రిటీలు కూడా హాజరయ్యారని సమాచారం. విషయం తెలుసుకున్న జిల్లా ఎక్సైజ్‌ టాస్కోఫోర్స్‌ బృందం కాంటినెంటల్‌ రిసార్ట్స్‌పై మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో అనుమతి లేకుండా విక్రయిస్తున్న మద్యం బాటిళ్ల ఎక్సైజ్‌ పోలీసులు సీజ్‌ చేశారు. అనంతరం బిగ్‌బాస్‌ ఫేమ్‌ మహబూబ్‌ షేక్, రిసార్ట్స్‌ మేనేజర్, ఈవెంట్‌ ఆర్గనైజర్‌పై కూడా కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో భారీగా మందు పట్టుబడింది. ఈ పార్టీకి కొందరు సెలబ్రిటీలు హాజరయ్యారు. కొందర్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు, మరికొందరిపై కేసులు నమోదు చేశారు.

ANN TOP 10