ముంబయి: బిలియనీర్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ – రాధిక వివాహానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నట్లు సమాచారం. నేడు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో వీరి వివాహం జరగనుంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమత ఇప్పటికే ముంబైకి చేరుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్, రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి, ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరుకానున్నారు.









