AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

స్టాండింగ్‌ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్‌.. రేపటి నుంచి 22వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ

జీహెచ్‌ఎంసీ స్థాయీ సంఘం సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ అయింది. 15 మంది సభ్యులతో స్టాండింగ్‌ కమిటీ ఏర్పడగా.. గత నెల 4న ఎర్రగడ్డ డివిజన్‌ ఎంఐఎం కార్పొరేటర్‌ షాహీన్‌ బేగం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేశారు.

ఎన్నికల షెడ్యూల్‌ ఇదీ..
ఈ నెల 12 (రేపటి ) నుంచి 22వ తేదీ వరకు పబ్లిక్‌ హాలిడే మినహా (13, 14, 17, 21) నామినేషన్లను జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్‌ (ఎన్నికల విభాగం) నామినేషన్లు స్వీకరిస్తారు.
నామినేషన్లు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తారు.
ఈ నెల 23న నామినేషన్ల పరిశీలన
26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు..ఆ తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల ప్రకటన.
వచ్చే నెల 5న ఎన్నిక-జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ.
అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి కౌంటింగ్‌, ఫలితాల వెల్లడి

ANN TOP 10