ఒడిస్సాలోని పూరీ జగన్నాథుడి ఆలయంలో ఉన్న రత్న భాండాగారం రహస్య గది తెరుచుకోనుంది. రత్న భాండాగారం రహస్య గదిని జూలై 14వ తేదీన తెరవాలని ఒడిశా ప్రభుత్వం జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో రత్న భాండాగారాన్ని తెరిచి స్వామి సంపద లెక్కింపు సహా భాండాగారం మరమ్మతులు పూర్తి చేయనున్నారు. డూప్లికేట్ తాళం పని చేయకపోతే , తాళాన్ని పగుల గొట్టి రత్న భాండాగారం రహస్య గదిని తెరవాలని నిర్ణయించారు.
జగన్నాథుడి ఆలయంలో ఉన్న రత్న భాండాగారం రహస్య గది జూలై 14 వ తేదీన తెరుచుకోనుంది. 46 ఏళ్ల క్రితం 1978లో చివరి సారిగా రత్న భాండాగారాన్ని తెరిచారు. మూసి ఉన్న రహస్య గదిని మళ్లీ జూలై 14న తెరవాలని ఒడిశా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయించింది. పూరీలో జరిగిన ఈ కమిటీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. రత్న భండాగారం రహస్య గది డూప్లికేట్ తాళాపు చెవి, కమిటీకి అప్పగించాలని శ్రీ జగన్నాథ్ ఆలయ యంత్రాంగం ప్రధాన అధికారిని కమిటీ ఆదేశించింది. డూప్లికేట్ తాళపు చేవి పనిచేయకపోతే తాళాన్ని పగలకొట్టి రత్న భాండాగారంలో ఉన్న రహస్య గది తెరవాలని సూచించింది.









