AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బోనమెత్తిన గోల్కొండ.. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు

భారీగా తరలివస్తున్న భక్తులు
శివసత్తుల పూనకాలు.. పోతరాజుల విన్యాసాలు..
కోటలో వెల్లివిరిసిన ఆధ్యాత్మికం

(అమ్మన్యూస్, గోల్కొండ):
ప్రఖ్యాత గోల్కొండ కోటలో ఆషాఢ బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం ఐదున్నర గంటలకు రాష్ట్ర కుమ్మర్ల సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి గోల్కొండ కోటకు భక్తులు భారీగా తరలివచ్చారు. శివసత్తుల పూనకాలు.. పోతరాజుల విన్యాసాలు.. అమ్మవారి నామస్మరణతో గోల్కొండ కోట మారుమోగుతోంది. ఈ నేపథ్యంలో గోల్కొండ కోటలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం జగదాంబికా మహంకాళి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా కోటపైకి తీసుకెళ్లారు. ఇప్పటికే వేలాదిమంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. భక్తిశ్రద్ధలతో జగదాంబికా మహంకాళి అమ్మవార్లను వేడుకుంటున్నారు.

ఉదయం నుంచే గోల్కొండ కోటలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి వెల్లడించారు. గోల్కొండ కోట పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ANN TOP 10