రాత్రి తొమ్మిదిన్నరకు గన్నవరం విమానాశ్రయానికి..
రాత్రి 10.20 గంటలకు చంద్రబాబు, అమిత్ షా భేటీ
రేపు ప్రధాని మోదీ, బండి సంజయ్ రాక
(అమ్మన్యూస్, అమరావతి):
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. ఇందుకోసం కేంద్రమంత్రి ఒక రోజు ముందే ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. మంగళవారం రాత్రి 9.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 10.20 గంటలకు అమిత్ షా–చంద్రబాబు భేటీ కానున్నారు. భేటీ అనంతరం రాత్రి 11.20 గంటలకు నోవాటెల్ హోటల్‌కు వెళ్లి అక్కడ బస చేయనున్నారు.
రేపు ప్రధాని రాక
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరవుతున్నారు. రేపు ఉదయం 10.40 గంటలకు ప్రధాని గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 10.55 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న వేదిక వద్దకు చేరుకుంటారు. నిన్న కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు.