AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీటీడీ బోర్డు చైర్మన్‌గా నాగబాబు!… కూటమి కీలక నిర్ణయం

(అమ్మన్యూస్, అమరావతి):
ఏపీలో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ఏర్పడటానికి కీలక పాత్ర పోషించిన పవన్‌ కల్యాణ్‌ టీటీడీపై ఫోకస్‌ చేసినట్లు తెలుస్తోంది. తన అన్న పార్టీకి వెన్నంటి నడుస్తున్న నాగబాబుకు టీటీడీ బోర్డు చైర్మన్‌ పదవి దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి పదవులు, డిప్యూటీ సీఎం, సహా నామినేటెడ్‌ పోస్టులు, రాజ్యసభ పోస్టులు తీసుకోవడం ద్వారా ఏపీ పాలిటిక్స్‌లో కీలక పాత్ర పోషించాలని పవన్‌ డిసైడ్‌ అయినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా నాగబాబుకు టీటీడీ చైర్మన్‌ కట్టబట్టడం ద్వారా తిరుమలలో ప్రక్షాళన మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ANN TOP 10