AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేపు ఎన్డీఏ ఎంపీల సమావేశం.. నేడు హస్తినకు బీజేపీ నేతలు..

ఇవాళ హస్తినకు తెలంగాణ బీజేపీ నేతలు వెళుతున్నారు. ఎంపీలుగా విజయం సాధించిన బండి సంజయ్, డీకే అరుణ, రఘనందనరావు తదితరులు ఢిల్లీకి వెళుతున్న వారిలో ఉన్నారు. రేపు ఢిల్లీలో ఎన్డీఏ ఎంపీల సమావేశం జరగనుంది. ఇప్పటికే ఢిల్లీలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. ప్రస్తుతం మోదీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరిగింది. శుక్రవారం ఎంపీలుగా గెలుపొందిన పార్టీ నేతలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. అనంతరం తర్వాత మిత్రపక్షాల నేతలు వేరుగా భేటీ అవుతారు.

ANN TOP 10