AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

17వ లోక్ సభను రద్దు చేస్తూ రాష్ట్రప్రతి నోటిఫికేషన్ జారీ

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన నేపథ్యంలో, కేంద్రంలో మూడో పర్యాయం నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడనుంది. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు వీలు కల్పించేలా లోక్ సభను రద్దు చేయాలన్న కేంద్ర క్యాబినెట్ సిఫారసును తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 85 (2) (బి) ప్రకారం తనకు ఉన్న విశేష అధికారాలను ఉపయోగించి 17వ లోక్ సభను రద్దు చేస్తున్నట్టు నోటిఫికేషన్ జారీ చేశారు.

ANN TOP 10