ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 350 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది ఈసీ. వీటిలో 75 సెంటర్లను పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు కేటాయించింది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమవ్వగా టీడీపీ అభ్యర్థులు లీడింగ్ లో ఉన్నారు.
చంద్రగిరిలో పులివర్తి నాని (టీడీపీ) ముందంజ
గజపతినగరంలో టీడీపీ అభ్యర్థి కె.శ్రీనివాస్ లీడ్
ఏపీ లోక్ సభ స్థానాలైన విజయవాడ, రాజమండ్రి, నరసరావుపేట, తిరుపతి స్థానాల్లో ముందంజలో ఉన్న కూటమి అభ్యర్థులు
హిందూపురం, అనకాపల్లి, గుంటూరు, శ్రీకాకుళంలలో కూటమి అభ్యర్థులు ఆధిక్యత
తిరుపతిలో వైసీపీ ఎంపీ అభ్యర్థి ముందంజ
వైసీపీ కంచుకోట పూతలపట్టులో టీడీపీ లీడింగ్
భీమవరం అసెంబ్లీ స్థానంలోనూ జనసేన అభ్యర్థి అంజిబాబు ఆధిక్యత
కాకినాడ రూరల్ నియోజకవర్గంలో లీడింగ్ లో ఉన్న జనసేన అభ్యర్థి పంతం నానాజీ
అనకాపల్లి లోక్ సభ అభ్యర్థి సీఎం రమేష్ ముందంజ
విజయవాడ వెస్ట్ లో కేశినేని చిన్ని, ముమ్మిడివరంలో టీడీపీ అభ్యర్థి బుచ్చిబాబు లీడింగ్
జీడీ నెల్లూరులో టీడీపీ అభ్యర్థి థామస్, తిరువూరులో టీడీపీ అభ్యర్థి కొలికిపూడి శ్రీనివాస్ ముందంజ
పిఠాపురంలో 4300 ఓట్లతో లీడింగ్ లో జనసేనాని పవన్ కల్యాణ్
గుడివాడలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఆధిక్యం, జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ 3550 ఓట్లతో లీడింగ్
మైదుకూరులో లీడింగ్ లో టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్
నగరి నియోజకవర్గంలో మంత్రి రోజా వెనుకంజ
కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి 2,274 ఓట్ల ఆధిక్యం
మంగళగిరిలో నారా లోకేశ్ ముందంజ
నెల్లూరులో విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధిక్యం
1973 ఓట్లతో పురందేశ్వరి లీడింగ్
రాజమండ్రిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి, నరసరావుపేటలో టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు లీడింగ్
ఏపీలో 28 స్థానాల్లో టీడీపీ, 5 స్థానాల్లో జనసేన అభ్యర్థులు లీడింగ్
కుప్పంలో 1600 ఓట్ల ఆధిక్యంలో చంద్రబాబు నాయుడు
పిఠాపురంలో తొలిరౌండ్ లో పవన్ కల్యాణ్ ఆధిక్యం
నంద్యాలలో బీజేపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి వైసీపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిపై 113 ఓట్లతో లీడింగ్
చెల్లుబోయిన వేణు పై బుచ్చయ్య చౌదరికి 2870 ఓట్లు ఆధిక్యం
ఈవీఎం రెండో రౌండ్ లోనూ గోరంట్ల ఆధిక్యం
17 స్థానాల్లో టీడీపీ, 4 స్థానాల్లో జనసేన లీడింగ్
నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ ఆధిక్యం
మండపేటలో టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు ఆధిక్యం
పిఠాపురం పోస్టల్ బ్యాలెట్ లో ఎక్కువగా చెల్లని ఓట్లు
ఈవీఎం ఫస్ట్ రౌండ్ లో బుచ్చయ్య చౌదరికి 5795 ఓట్లు, చెల్లుబోయిన వేణుగోపాల్ కు 4885 ఓట్లు
కుప్పంలో చంద్రబాబు 1549 ఓట్లతో ఆధిక్యం
నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ ఆధిక్యం
మొదటి రౌండ్ లో రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 910 ఓట్లతో లీడింగ్
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో ఒకస్థానంలో టీడీపీ ఆధిక్యం









