AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం: సుమోటోగా స్వీకరించిన హైకోర్టు, నేడు విచారణ

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రాష్ట్ర హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులతో పాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాపింగ్ చేశారంటూ పత్రికల్లో వచ్చిన వార్త కథనాలపై హైకోర్టు స్పందించింది. ఈ కథనాలను పరిశీలించిన హైకోర్టు సుమోటో పిటిషన్‌గా స్వీకరించింది.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాదే, జస్టిస్ టి వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ఐబీలో పనిచేసిన ఎఏస్పీ భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలంలో టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో నాటి బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్‌ను విమర్శించే ప్రతి రాజకీయ నాయకులతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శరత్ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు భుజంగ రావు వెల్లడించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు సూచనలతో మేకల తిరుపతన్న, డీ ప్రణీత్ రావు, టాస్క్ ఫోర్సు మాజీ డీసీపీ జి రాధాకిషన్ లు.. ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు కథనాలు ప్రచురితమయ్యాయి.

ANN TOP 10