AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మరికొన్ని గంటల్లో ఎలక్షన్ రిజల్ట్స్.. ఏ సెగ్మెంట్‌లో ఎన్ని రౌండ్లు..

తెలంగాణ‌లో హోరాహోరీగా సాగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాలకు ఎన్నికలు జరగ్గా.. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు నడిచింది. అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అన్ని శక్తులొడ్డి ప్రచారం నిర్వహించారు. కాగా.. జూన్ 1న విడుదలైన ఎగ్జిట్ పోల్స్.. ఫలితాలపై మరింత ఉత్కంఠను రేకెత్తించాయి. దీంతో.. రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆసక్తితో ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

అయితే.. మంగళవారం ఉద‌యం 8 గంట‌ల‌కు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొద‌లవుంది. కాగా.. తొలి ఫ‌లితం మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌ వ‌ర‌కు వెలువ‌డే ఛాన్స్ ఉంది. తుది ఫ‌లితం సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు రానున్నట్టు అధికారులు చెప్తున్నారు. కాగా.. తొలి ఫ‌లితం నిజామాబాద్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో వెలువ‌డ‌నుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కేవ‌లం 15 రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయి.. ఫలితం వెల్లడించనున్నారు.

ఇక.. క‌రీంన‌గ‌ర్, న‌ల్గొండ‌, హైద‌రాబాద్ నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం ఫ‌లితాలు చివ‌రిలో వెలువ‌డే అవ‌కాశం ఉంది. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట్ల లెక్కింపు 24 రౌండ్లలో జరుగుతుంది. మొత్తానికి ఈసారి తెలంగాణ లోక్ సభ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై సర్వత్రా ఉత్కంఠ నెల‌కొంది.

లోక్ సభ నియోజ‌క‌వ‌ర్గాల వారిగా ఓట్ల లెక్కింపు రౌండ్ల వివ‌రాలు
నిజామాబాద్ – 15
వ‌రంగ‌ల్ – 18
సికింద్రాబాద్ – 20
మ‌ల్కాజిగిరి – 21
ఖ‌మ్మం – 21
పెద్దప‌ల్లి – 21
మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ – 21
నాగ‌ర్‌క‌ర్నూల్ – 22
మ‌హ‌బూబాబాద్ – 22
ఆదిలాబాద్ – 23
జ‌హీరాబాద్ – 23
మెద‌క్ – 23
చేవెళ్ల – 23
భువ‌న‌గిరి – 23
క‌రీంన‌గ‌ర్ – 24
హైద‌రాబాద్ – 24
న‌ల్గొండ – 24

ANN TOP 10