AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేపు మద్యం దుకాణాలు బంద్‌.. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
మందుబాబులకు మరో బిగ్‌ షాక్‌. రేపు రాష్ట్ర వ్యాప్తంగా డ్రైడే అని ఈసీ ప్రకటించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలులో ఉండనున్నట్లు పేర్కొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జూన్‌ 4న ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని పోలీసులు ప్రకటించారు. ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి నిరాకరించింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులను మూసి ఉంచనున్నారు.

కొన్ని జిల్లాల్లో మూడు రోజుల పాటు వైన్స్‌ను బంద్‌ ఉంచనున్నారు. ఎవరైనా అక్రమంగా మద్యం నిల్వ చేసి అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అభ్యర్థుల ఇళ్లు, సున్నిత ప్రాంతాల్లో భద్రత పెంచనున్నట్లు ఈసీ తెలిపింది. తెలంగాణలో కౌంటింగ్‌ కు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు 17 లోక్‌ సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాష్ట్రంలో గత నెల 13న లోక్‌సభ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. ఓట్లను జూన్‌ 4న లెక్కించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

ANN TOP 10