రాష్ట్ర అవతరణ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ మేరకు శుక్రవారం ఆహ్వాన పత్రికను ప్రభుత్వ సలహాదారు, ప్రోటోకాల్ ఇంచార్జ్ హర్కర వేణుగోపాల్ రావు అందజేశారు. హైదరాబాద్‌లో నందినగర్‌లో కేసీఆర్ ఇంటికి వెళ్లి.. స్వయంగా ఆయన రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కేసీఆర్‌ను ఆహ్వానించినట్లు వేణుగోపాల రావు తెలిపారు. ఆహ్వాన పత్రికతో పాటు సీఎం రాసిన లేఖను కూడా అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో ఆయనను భాగస్వామ్యం కావాలని కోరినట్లు స్పష్టం చేశారు. కేసీఆర్ అందుకు సానుకూలంగా స్పందించారని అన్నారు. ఈ ఏడాది దశాబ్ది ఉత్సవాలను కాంగ్రెస్ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. కేసీఆర్‌కు అవతరణ దినోత్సవ ఆహ్వానం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్‌ను ఆహ్వాన పత్రికను ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు, ప్రోటోకాల్ ఇంచార్జ్ వేణుగోపాల్ రావుకు బాధ్యతలు అప్పగించారు.
