AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేటితో ముగిసిన వేసవి సెలవులు.. రేపట్నుంచి జూనియర్‌ కాలేజీలు పునఃప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికిగాను జూన్‌ 1 నుంచి జూనియర్‌ కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ విద్యా మండలి వార్షిక అకడమిక్‌ క్యాలెండర్‌ ను విడుదల చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలకు మార్చి 31 నుంచి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. నేటితో (మే 31)తో సెలవులు ముగియనున్నాయి. దీంతో శనివారం (జూన్‌ 1) నుంచి జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ విద్యార్ధులకు తరగతులు పునఃప్రారంభం కానున్నాయి.

ANN TOP 10