AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. బాధితుల లిస్టులో బడా నేతలు..

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన బడా నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు రాధాకిషన్ రావు ఒప్పుకున్నాడు.

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు, రిటైర్డ్ అధికారులు పోలీసు కస్టడీలో ఉన్నారు. తాజాగా.. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారిన వ్యక్తులపై నిఘా ఉంచినట్లు విచారణ సందర్భంగా తన వాంగ్మూలంలో రాధాకిషన్ రావు వెల్లడించారు. సొంత పార్టీ నేతలపై కూడా నిఘా ఉంచాలని బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న అప్పటి మంత్రి ఆదేశించినట్లు చెప్పారు.

కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానందతో విభేదాలున్న శంబీపూర్‌ రాజుపై, కడియం శ్రీహరితో ఉన్న రాజయ్యకు విభేదాలు ఉండటంతో వారి ఫోన్లు, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి పట్నం మహేందర్‌రెడ్డి దంపతులకు విభేదాలు ఉండటంతో వారిపైనా నిఘా ఉంచినట్లు చెప్పారు. అలాగే అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపైన నిఘా ఉంచినట్లు రాధాకిషన్‌ రావు వెల్లడించారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న ఫోన్ల ట్యాప్ చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్‌ రెడ్డి, సరిత తిరుపతయ్య, జువ్వాడి నర్సింగరావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్ల ట్యాప్ చేసినట్లు చెప్పారు. బీజేపీ నేతలు ఈటల, బండి సంజయ్, ఎంపీ అరవింద్ అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు రాధాకిషన్ రావు ఒప్పుకున్నారు.

ANN TOP 10