AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గ్యాస్ సబ్సిడీకి బ్రేక్, పేద-మధ్య తరగతి ప్రజలకు షాక్..!

ఇరాన్-అమెరికా యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒకరోజు అమెరికా దాడులు చేస్తుంటే.. మరొక రోజు ఇజ్రాయెల్ దాడులకు దిగుతోంది. ఈ ఉద్రిక్తతల ప్రభావం చమురుపై పడింది. పరిస్థితి గమనించిన కేంద్రప్రభుత్వం, సబ్సిడీపై ఇచ్చే సిలిండర్ల సంఖ్యను సగానికి పైగా కుదించేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో పేద-మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

 

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు గట్టి షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకం కింద రాయితీతో ఇచ్చే సిలిండర్ల సంఖ్యలో కోత వేసింది. లబ్ధిదారులకు ఏడాదికి నాలుగు సిలిండర్లను సరఫరా చేయనుంది. 14.2 కిలోల బరువున్న 9 సిలిండర్లను రాయితీ ధరకు ప్రభుత్వం అందజేస్తోంది.

 

పీఎంయూవై పథకం ప్రారంభంలో 12 సిలిండర్లు సరఫరా చేసేది కేంద్రం. గతేడాది వీటి సంఖ్యను 9కి పరిమితం చేసింది. ఉజ్వల లబ్ధిదారుల సగటు వార్షిక వినియోగాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం, రాయితీ సిలిండర్లను నాలుగుకు తగ్గించినట్లు పెట్రోలియం శాఖ అదనపు కార్యదర్శి వెల్లడించారు.

 

గ్యాస్ సబ్సిడీకి బ్రేక్, షాకైన పేద-మధ్య తరగతి ప్రజలు

 

వంటకు ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడంతోపాటు అందుబాటు ధరలో సరఫరా చేసేందుకు 14.2 కిలోల సిలిండర్‌పై రూ.200 రాయితీని నాలుగేళ్ల కిందట ప్రకటన చేసింది కేంద్రం. దీని ప్రకారం ఏడాదికి 12 సిలిండర్లు ఇచ్చేది. రాయితీ నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమ చేసేది. 2023 అక్టోబరులో సిలిండర్‌పై రాయితీ రూ.300లకు పెరిగిన విషయం తెల్సిందే.

 

గతేడాది రాయితీ సిలిండర్ల సంఖ్యను 12 నుంచి తొమ్మిదికి తగ్గించింది కేంద్రం. ఢిల్లీలో ఉజ్వల యోజన లబ్ధిదారులకు రూ.300 రాయితీ రావడంతో సిలిండర్‌ ధర రూ.642గా ఉంది. ఒక్కో గ్యాస్ సిలిండర్‌ సరఫరాకు కంపెనీలు రూ.1,600 వరకు వెచ్చిస్తుంటాయని కార్యదర్శి వెల్లడించారు.

 

ఉజ్వల వినియోగదారులకు తక్కువ ధరకు సరఫరా చేస్తున్నందున ప్రతి సిలిండర్‌పై రూ.1,000 వరకు లబ్ధి కలుగుతుందన్నారు. మొత్తానికి చమురు కంపెనీలపై పడుతున్న అదనపు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి సబ్సిడీ సిలిండర్లలో కోత విధించింది కేంద్రం.

ANN TOP 10