AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్‌ బస్సుయాత్ర షెడ్యూల్‌ మార్పు.. 24 నుంచి రోడ్‌ షోలు, కార్నర్‌ మీటింగులు

లోక్‌సభ ఎన్నికల ప్రచార నిమిత్తం బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించ తలపెట్టిన బస్సు యాత్ర షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా అనుకున్న దానికంటే రెండు రోజులు ఆలస్యంగా ఈనెల 24 నుంచి యాత్ర ప్రారంభం కానుంది. మే 10 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో భాగంగా కేసీఆర్‌ పలు జిల్లాల్లో రోడ్‌ షోలు, కార్నర్‌ మీటింగులు కూడా నిర్వహించనున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో 24న సాయంత్రం 5.30 గంటలకు ఆరంభమయ్యే ఈ యాత్ర… వచ్చేనెల 10న సాయంత్రం 6.30 గంటలకు సిద్దిపేటలో జరిగే బహిరంగ సభతో ముగియనుంది.
కేసీఆర్‌ రోడ్‌షోల వివరాలు…(24.04.24 నుంచి)
ఈనెల 24- సాయంత్రం 5.30 గంటలకు మిర్యాలగూడ
రాత్రి 7 గంటలకు సూర్యాపేటలో రోడ్‌ షో (రాత్రి బస)
25 -సాయంత్రం 6 గంటలకు భువనగిరి (రాత్రి బస ఎర్రవల్లిలో)
26-సాయంత్రం 6 గంటలకు మహబూబ్‌ నగర్‌ (రాత్రి బస)
27-సాయంత్రం 6 గంటలకు నాగర్‌ కర్నూల్‌ (హైదరాబాద్‌లో రాత్రి బస)
28-సాయంత్రం 6 గంటలకు వరంగల్‌ (రాత్రి బస)
29-సాయంత్రం 6 గంటలకు ఖమ్మం (రాత్రి బస)
30-సాయంత్రం 5.30 గంటలకు తల్లాడ
30-సాయంత్రం 6.30 గంటలకు కొత్తగూడెంలో రోడ్‌ షో (రాత్రి బస కొత్తగూడెంలో)
మే నెలలో
01.05.24-సాయంత్రం6 గంటలకు మహబూబాబాద్‌లో రోడ్‌ షో (వరంగల్‌లో రాత్రి బస)
02.05.24-సాయంత్రం 6 గంటలకు జమ్మికుంట (వీణవంకలో రాత్రి బస)
03.05.24-సాయంత్రం 6 గంటలకు రామగుండం (రామగుండంలో రాత్రి బస)
04.05.24-సాయంత్రం 6 గంటలకు మంచిర్యాల (కరీంనగర్‌లో రాత్రి బస)
05.05.24-సాయంత్రం 6 గంటలకు జగిత్యాల ( జగిత్యాలలో రాత్రి బస)
06.05.24-సాయంత్రం 6 గంటలకు నిజామాబాద్‌ ( నిజామాబాద్‌లో రాత్రి బస)
07.05.24-సాయంత్రం 5.30 గంటలకు కామారెడ్డి
07.05.24-రాత్రి 7 గంటలకు మెదక్‌ (మెదక్‌లో రాత్రి బస)
08.05.24-సాయంత్రం 5.30 గంటలకు నర్సాపూర్‌
08.05.24-రాత్రి 7 గంటలకు పటాన్‌ చెరువు (ఎర్రవెల్లిలో రాత్రి బస)
09.05.24-సాయంత్రం 6 గంటలకు కరీంనగర్‌ (కరీంనగర్‌లో రాత్రి బస)
10.05.24-సాయంత్రం 5 గంటలకు సిరిసిల్లలో రోడ్‌ షో
10.05.24-సాయంత్రం 6.30 గంటలకు సిద్దిపేటలో బహిరంగ సభ (హైదరాబాద్‌లో రాత్రి బస)

ANN TOP 10