AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భర్త ఉండగానే వదినతో మరిది కాపురం.. ఇద్దరు పిల్లలు పుట్టాక షాకింగ్ ట్విస్ట్..!

వినాశకాలే విపరీత బుద్ధి.. అన్నట్టు తయారైంది ప్రస్తుత సమాజం. వావి వరసలేమీ లేకుండా విచ్చలవిడితనం ఎక్కువైపోయి.. విశృంఖలంగా వ్యవహరిస్తున్నారు. అమ్మలాంటి వదినతోనే కాపురం చేసి.. ఇద్దరు పిల్లల్ని కన్నాడు. అది కూడా అత్తామామల డైరెక్షన్‌లోనే. అంతా గుట్టుచప్పుడు కాకుండా.. ఇంట్లోనే ఈ వ్యవహారాన్ని నడిపించి.. ఇంతకూ ఈ దారుణమైన ఘటన ఎక్కడ జరిగిందనుకుంటున్నారా.. తెలంగాణలోని వరంగల్ జిల్లాలోనే.

వరంగల్ జిల్లాలోని న‌ల్లబెల్లి మండ‌లంలోని బజ్జుతండా శివారు చిన్నతండాకు చెందిన యువ‌కుడికి ఎల్లాయగూడానికి చెందిన యువ‌తితో 2017లో పెళ్లి జ‌రిగింది. అయితే.. ఎన్ని రోజులైన పిల్లలు పుట్టకపోవడంతో దంపతులు వైద్యులను సంప్రదించారు. ఇద్దరికీ పరీక్షలు చేసిన వైద్యులు.. భర్తలో లోపం ఉందని.. అతనికి పిల్లలు పుట్టే అవకాశం లేదని తేల్చేశారు. దీంతో.. పిల్లలు పుట్టే ఛాన్స్ లేని భర్తతో కాపురం చేయలేనని చెప్పి ఆ భార్య పుట్టింటికి వెళ్లింది.

తన కొడుకు గురించి కోడలు అందరికీ చెప్తే తమ కుటుంబ పరువు పోతుందనుకున్నారో ఏమో.. అత్తామామ మరిది కలిసి.. ఆమె దగ్గరికి వెళ్లి పిల్లలు పుట్టేందుకు ఆస్పత్రిలో చూపిస్తామని ఒప్పించి ఇంటికి తీసుకొచ్చారు. తీరా ఇంటికి వచ్చాక.. మరిదితో కాపురం చేయాలంటూ కొత్త కండీషన్ పెట్టారు. మన కుటుంబం పరువు పోకుండా.. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా.. మనం అందరం కలిసి సంతోషంగా ఉందామని.. ఉన్న ఆస్తిపాస్తులు కూడా మనమే అనుభవిస్తామంటూ.. ఎవేవో మాయమాటలు చెప్పి ఆమెను మరిదితో కాపురానికి ఒప్పించారు.

ఇంకేముంది.. అత్తామామల డైరెక్షన్‌లో ఇంట్లోనే హసీన్ దిల్ రుబా సినిమా నడిచింది. వదిన మరుదులు కాపురానికి ఫలితంగా.. ఓ కుమారుడు, కుమార్తె జన్మించారు. అయితే.. ఇన్నాళ్లుగా గుట్టుచప్పుడుగానే ఈ సినిమా నడిచింది. కాగా.. ఈ మద్య కొంతకాలంగా అత్తామామ, మరిది.. తరచూ ఆమెతో గొడవ పడుతున్నారు. ఈ గొడవల్లో భాగంగా.. పుట్టింటికి వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తున్నారు. మధ్యలో ఆమెపై దాడికి కూడా పాల్పడ్డారు. దీంతో.. ఆమె పుట్టింటికి వెళ్లింది.

ఇదే అదునుగా చేసుకుని.. వేరే అమ్మాయితో మరిదికి పెళ్లి చేసేందుకు అత్తామామలు నిశ్చయించారు. నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ విష‌యం తెలుసుకున్న మ‌హిళ.. చిన్నతండాకు వచ్చి వాళ్లను నిలదీసింది. దీంతో అత్తింటివారు ఆమెను దూషించి వెళ్లగొట్టడంతో నేరుగా న‌ల్లబెల్లి పోలీసులను ఆశ్రయించింది. మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దర్యాప్తులో భాగంగా.. అత్తింటివారిని విచారిస్తే… బుకాయిస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. కేసు విచార‌ణ‌లో భాగంగా అవ‌స‌ర‌మైతే పిల్లలకు డీఎన్‌ఏ వైద్య ప‌రీక్షలు నిర్వహించేందుకు అనుమ‌తులు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ఇంత జరుగుతున్నా.. ఆమె భర్త ఏం చేస్తున్నాడు.. అన్నది అందరి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న.

ANN TOP 10