హైదరాబాద్ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వాహనాన్ని పోలీసులు శుక్రవారం ఖమ్మం జిల్లా మధిర మండలం ఆత్కూరు క్రాస్ రోడ్డు వద్ద తనిఖీ చేశారు. (Police checked) ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు డిప్యూటీ సీఎం పూర్తిగా సహకరించారు. డిప్యూటీ సీఎం వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు. తనిఖీకి సహకరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.









