AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి అధికారుల షాక్

హైదరాబాద్: మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి (Marri Rajasekhar Reddy)కి అధికారులు షాక్ ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డికి చెందిన అక్రమ కట్టడాలను నేడు అధికారులు కూల్చివేశారు. దుండిగల్‌ (Dundigal)లోని చిన్న దామర చెరువుపై కట్టిన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్‌లోని అక్రమ కట్టడాలన్నింటినీ అధికారులు కూల్చేశారు. రాజశేఖర్ రెడ్డి చెరువును ఆక్రమించి కాలేజ్‌లో కొన్ని నిర్మాణాలు చేశారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో దుండిగల్, గండి మైసమ్మ మండల రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు ఆధ్వర్యంలో కూల్చివేతలు జరిగాయి.

ANN TOP 10