AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎన్డీఎస్‌ఏ కమిటీకి పూర్తిగా సహకరిస్తాం: మంత్రి ఉత్తమ్

మేడిగడ్డ బ్యారేజి డ్యామేజ్‌ రీజన్స్ చెప్పాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు బుధవారం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇరిగేషన్ అధికారులతో ఎన్డీఎస్‌ఏ టీమ్ సమావేశం అయ్యింది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన ఘటనపై నివేదికను ఎన్డీఎస్‌ఏ బృందం ఇవ్వనుంది. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్‌గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. బ్యారేజీలు రిపెర్స్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సాధ్యాసాధ్యాలు చెప్పాలని, సమస్యకు కారణం ఎవరు అనేది అడిగినట్లు వెల్లడించారు. ఎన్డీఎస్‌ఏ కమిటీకి ప్రభుత్వం పూర్తి సహకారం ఉంటుందన్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న అన్ని డాక్యుమెంట్స్ ఎన్డీఎస్‌ఏ కమిటీకి ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఎవరైనా ఎన్డీఎస్‌ఏ కమిటీకి సహకారం ఇవ్వకపోతే డాక్యుమెంట్స్ దాచితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు, ఎల్లుండి మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారని తెలిపారు. 8న సుందిళ్ల బ్యారేజీ విసిట్ ఉంటుందని తెలిపారు.

టెస్టుల కోసం ప్రపంచంలో ఎంత అత్యాధునిక టెక్నాలజీ వాడాలని సుచించామని చెప్పారు. రిపేర్ చేసి మళ్ళీ అందుబాటులోకి వస్తే రాష్ట్రానికి మంచిదని అభిప్రాయపడ్డారు. వర్షాకాలానికి ముందే అందుబాటులోకి వస్తే మరీ మంచిదన్నారు. ఈఎన్‌సీనాగేందర్ ఆధ్వర్యంలో అయ్యర్ కమిటీ విసిట్ పూర్తి చేసుకుంటుందని గుర్తు చేశారు. ఎన్డీఎస్‌ఏ ప్రాథమిక రిపోర్ట్ రాగానే తప్పులు ఉంటే నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎల్ అండ్ టీ రాష్ట్రంలో అనేక వ్యాపారాలు చేస్తుందని తెలిపారు. చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నామని, నిర్మాణ సంస్థకు కూడా బాధ్యత ఉండాలని అన్నారు. జుడిషియల్ ఎంక్వైరీ పై కూడా త్వరలోనే ముందడుగు ఉంటుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

ANN TOP 10