గొర్రెల పంపిణీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గొర్రెల పంపిణీ స్కామ్ కుంభకోణంలో నలుగురు పశుసంవర్ధక శాఖ అధికారులు అరెస్ట్ అయ్యారు. ఇందులో రూ. 2.10 కోట్ల స్కామ్ జరిగినట్లు బయటపడింది. పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవి, కామారెడ్డి ఏరియా హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య, రఘుపతి రెడ్డి, గణేష్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ నలుగురిని ఏసీబీ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీకి సంబంధించిన ఫైల్స్ పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మాయమయ్యాయి. దీంతో గొర్రెల పంపిణీలో కోట్ల రూపాయలు ఇతరల ఖాతాకు బదిలీ అయ్యాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ అవకతవకలపై దృష్టి సారించింది. ఇక ఈ కేసును ఏసీబీకి అప్పగించింది. విచారణ జరుగుతున్న సమయంలో నలుగురు అధికారులు అరెస్టు కావడం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాకుండా ఈ కుంభకోణంలో పలువురు నేతల పాత్ర ఉందని ప్రచారం జరుగుతోంది.









