‘కమల్‌హాసన్ సార్ నా ఫేవరెట్ యాక్టర్. ‘మహానది’ సినిమా అంటే నాకు పిచ్చి. ఎన్నిసార్లు చూశానో లేక్కేలేదు. కమల్‌సార్‌ని చూస్తే చాలు అనుకునేదాన్ని. ఇప్పుడు ఆయన ప్రొడక్షన్లో నటిస్తున్నాను. ఆయనతో ఇప్పటివరకూ నటించే అవకాశం రానందుకు బాధగా ఉంది’ అంటున్నది అందాలతార సాయిపల్లవి. ఆమె ప్రస్తుతం శివకార్తికేయన్ ‘ఎస్కే 21’లో కథానాయికగా నటిస్తున్నది. ఆర్.మహేంద్రన్, వివేక్ కృష్ణానిలతో కలిసి కమల్‌హాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా గురించి ఇటీవల మీడియాతో ఆసక్తికరమైన విషయాలను వెల్లడిరచింది సాయిపల్లవి. ‘ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో కమల్‌సార్‌ని కలిశాను. ఆయన నవ్వుతూ పలకరించిన తీరు జీవితంలో మరిచిపోలేను. అదొక మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఇక ఇందులోని నా పాత్ర విషయానికొస్తే.. ప్రేయసిగా, భార్యగా, ఓ బిడ్డకు తల్లిగా రకరకాల పార్శాలతో కూడుకున్న పాత్ర నాది. అరుదుగా మాత్రమే ఇలాంటి పాత్రలు దొరుకుతుంటాయి’ అని అన్నారు.









