AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఫిబ్రవరిలో రష్మికతో నిశ్చితార్థం, పెళ్లి?.. క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ

ప్రముఖ యువ హీరో విజయ్ దేవరకొండ రూమర్లపై స్పందించారు. కొన్ని మీడియా సంస్థలు ఎప్పుడూ తన చుట్టూ తిరుగుతుంటాయని, తాను కనిపిస్తే చాలు పెళ్లి చేసేయాలని చూస్తున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇలాంటి రూమర్లు తనపై వస్తూనే ఉన్నాయని, ప్రతి రెండేళ్లకోసారి నాకు పెళ్లి చేయాలని కొన్ని మీడియా సంస్థలు భావిస్తున్నాయని ఎద్దేవా చేశారు.

ఎప్పట్లాగానే ఇటీవల విజయ్ దేవరకొండ, రష్మికపై కొన్ని ఊహాగానాలు వచ్చాయి. వీటి గురించే విజయ్ దేవరకొండ పైవిధంగా స్పందించినట్టు తెలుస్తోంది. రూమర్లలో పేర్కొన్నట్టుగా ఫిబ్రవరిలో తనకు నిశ్చితార్థమేమీ జరగడంలేదని, పెళ్లి కూడా జరగడంలేదని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం విజయ్ లైఫ్ స్టైల్ ఏసియా అనే మ్యాగజిన్ కోసం ఫోటో షూట్లు చేశాడు. ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ANN TOP 10