తెలంగాణలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ వ్యాపార సంస్థలు ముందుకొస్తున్నాయి. దావోస్ (Davos)లో జరుగుతున్న వార్షిక సమావేశం 2024లో అదానీ గ్రూప్ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
తెలంగాణలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ వ్యాపార సంస్థలు ముందుకొస్తున్నాయి. దావోస్ (Davos)లో జరుగుతున్న వార్షిక సమావేశం 2024లో అదానీ గ్రూప్ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో అదానీ గ్రూప్ కు చెందిన నాలుగు వ్యాపార సంస్థలు 12,400కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో ఎంవోయూ కుదుర్చుకుంది. ఇందులో గ్రీన్ ఎనర్జీ విభాగంలో 5వేల కోట్లు, డేటా సెంటర్ విభాగంలో మరో 5వేల కోట్లు,ఏరోస్పేస్, రక్షణ విభాగంలో వెయ్యి కోట్లు, అంబుజా సిమెంట్ గ్రిడ్డింగ్ యూనిట్లో 1400కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ(Gautam Adani)తో రేవంత్ రెడ్డి ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఉన్నారు.









