కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌కాళీలో ఈడీ బృందంపై స్థానికులు దాడికిపాల్పడ్డారు. రేషన్ డిస్ట్రిబ్యూషన్ కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్ నివాసంపై ఈడీ అధికారులు దాడిచేశారు. సోదాల అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అక్కడినుంచి తీసుకెళ్తుండగా.. సుమారు 200 మందికిపైగా స్థానికులు వారి కార్లను చుట్టుముట్టారు. వాటిని ధ్వంసం చేశారు. కాగా, పశ్చిమబెంగాల్‌లో 30 శాతానికిపైగా రేషన్ బియ్యం పక్కదారిపడుతున్న ఆరోపణలు ఉన్నాయి. రైతుల పేరుతో నఖిలీ ఖాతాలు తెరిచిన పలువురు రైస్ మిల్లర్లు, కోఆపరేటివ్ సొసైటీలు ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను రైతులకు ఇవ్వకుండా వారే తీసుకుంటున్నారని ఈడీ పేర్కొన్నది.









