AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం..

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో హుండీ ఆదాయం కూడా పెరిగింది. 28 రోజులకు గానూ ఆలయ హుండీ ద్వారా రికార్డుస్థాయిలో రూ.3.15 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. 28 సాధారణ రోజుల్లో ఆలయ ఖజానాకు హుండీ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరడం ఆలయ చరిత్రలో సరికొత్త రికార్డు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ ప్రజల ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం సాధారణ రోజుల్లో 10 నుంచి 20 వేల మంది, సెలవు దినాల్లో 60 నుంచి 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. గత 28 సాధారణ రోజుల్లో ఆలయ హుండీల ద్వారా రికార్డుస్థాయిలో రూ.3.15 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఈ మేరకు భక్తులు సమర్పించిన నగదు, నగల కానుకలను కొండ కింద ఆధ్యాత్మికవాడ లోని శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపంలో లెక్కించారు.

నగదు రూ.3,15,05,035, బంగారం 100 గ్రాములు, వెండి 4,250 గ్రాములు నగల రూపంలో సమకూరినట్లు ఆలయ ఈవో రామకృష్ణారావు తెలిపారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్‌, యూఏఈ, బ్రిటన్‌, సౌదీ అరేబియా, ఒమన్‌, మలేసియా, నేపాల్‌, ఖతార్‌, థాయిలాండ్‌, న్యూజిలాండ్‌ దేశాల నగదు (కరెన్సీ) కూడా హుండీల ద్వారా లభించింది. గతంలో నగదు ఆదాయం రూ.2.5 కోట్లు రాగా ఈసారి రూ.3.15 కోట్లు రావడం విశేషమని ఈవో తెలిపారు. ఇది ఆలయ చరిత్రలో సరికొత్త రికార్డుగా అధికారులు చెబుతున్నారు.

ANN TOP 10