AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమల్లోకి రాజీవ్‌ ఆరోగ్యశ్రీ

ఇందులో 1672 రోగాలకు చికిత్సలు
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలందరికీ కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు చేయూత పథకం కింద రాజీవ్‌ ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పథకం కింద ఎంపిక చేసిన అన్ని ఆసుపత్రుల్లో 1,672 రోగాలకు వైద్యం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద సాయం పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జిల్లాలో లాంఛనంగా జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ప్రారంభించారు.పేదలందరికీ ఉచిత కార్పోరేట్‌ వైద్యం అందించేందుకు చేయూత పథకం ద్వారా రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షలు సంవత్సరానికి వైద్య ఆరోగ్య సహాయం ఇవ్వనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌ పోట్రు అన్నారు. శనివారం శామీర్‌పేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేయూత (రాజీవ్‌ఆరోగ్యశ్రీ ) పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఆరోగ్యశ్రీ పథకం పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ANN TOP 10