AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవం..
తెలంగాణ మూడో అసెంబ్లీ మొట్టమొదటి సమావేశం శనివారం ప్రారంభమైంది. కొత్తగా ఎన్నికైన సభ్యులు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. రాజ్ భవన్‌లో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేసిన అక్బరుద్దీన్‌ ఒవైసీ.. ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తున్నారు. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సీతక్క, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు..

ప్రొటెం స్పీకర్‌ ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ గత సంప్రదాయాలను, నియమాలను తుంగలో తొక్కిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎంఐఎంతో ఒప్పందంలో భాగంగానే అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించారని విమర్శించారు. ఇందుకు నిరసనగా తాము ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.

తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, ఇతర మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు అక్షర క్రమంలో ప్రమాణం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనారోగ్య కారణాలతో అసెంబ్లీకి హాజరుకాలేదు. మాజీ మంత్రి కేటీఆర్ తన తండ్రి వద్దనే ఉండటం కారణంగా ఆయన కూడా అసెంబ్లీకి రాలేదు.

ANN TOP 10