AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ… ఆరు గ్యారెంటీలపై చర్చ

కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆరు గ్యారంటీల అమలు, ప్రజా సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్ శాంతికుమారి, వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.

కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి సీఎస్ లేఖ
నాగార్జున సాగర్ అంశంపై రేపటి సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ సీఎస్ శాంతికుమారి కోరారు. ఈ మేరకు కేంద్ర జల శక్తి కార్యదర్శికి లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన తరుణంలో వాయిదా వేయాలని కోరారు. జనవరి నెలలో సమావేశం నిర్వహించాలని కోరారు.

ANN TOP 10