AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు రేవంత్‌ ప్రమాణ స్వీకారం-ఎల్బీ స్టేడియంలో సర్వం సిద్ధం

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకార మహౌత్సవానికి హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం ముస్తాబైంది. మైదానంలో మొత్తం మూడు వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై రేవంత్‌ రెడ్డి మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎడమ వైపు 63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం, కుడి వైపు వీవీఐపీల కోసం 150 సీట్లతో రెండు వేదికలను సిద్ధం చేశారు. 8వ గేటు నుంచి రేవంత్‌ స్టేడియంలోకి రానున్నారు. మూడు వేదికలతో పాటు అమర వీరుల కుటుంబాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధ్యక్షులతో పాటు తెలంగాణలో సాధారణ ప్రజలను సైతం రేవంత్‌ రెడ్డి ప్రమాణ సీకారోత్సవానికి ఆహ్వానించారు.

స్టేడియం కేపాసిటీ 80 వేలు కాగా, ప్రజల కోసం 30 వేల సీట్లను ఏర్పాటు చేశారు. దాదాపు లక్ష మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నేరుగా చూడలేని వారి కోసం స్టేడియం చుట్టూ ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకు ండా సీసీ కెమెరాలతో పాటు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మహబూబా, అలియా కాలేజీల్లో వాహనాల పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్‌ కళాకా రులు సాంస్కతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు. హుస్నా బాద్‌ ఎమ్మెల్యె పొన్నం ప్రభాకర్‌, నేతలు మల్లు రవి, వేం నరేం దర్‌ రెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, మున్సీతో పాటు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్‌ పార్టీ నాయ కులు సైతం ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు.

ANN TOP 10